
Geminiని ఉపయోగించి లెసన్ ప్లాన్‌లను, సపోర్టింగ్ మెటీరియల్స్‌ను క్రియేట్ చేయండి
Outline
కంటెంట్ పరిచయం
Geminiతో ప్లాన్ చేయడం
ట్రెడిషనల్‌గా, హై-క్వాలిటీ గల, ఫలితాల ఆధారిత లెసన్ ప్లాన్‌లను, ఇతర లెర్నింగ్ మెటీరియల్స్‌ను రూపొందించడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఉదాహరణకు, విభిన్న లెర్నింగ్ స్థాయిలకు అనుగుణంగా విభిన్న వర్క్‌షీట్‌లను క్రియేట్ చేయడం, స్థానిక సంస్కృతికి సరిపోయే ఉదాహరణలను వెతకడం, వీటన్నింటినీ విద్యా సామర్థ్యాలకు అనుగుణంగా మ్యాప్ చేయడం వంటి పనులను మాన్యువల్‌గా డ్రాఫ్ట్ చేయాలంటే గంటల కొద్దీ సమయం పడుతుంది. ఇక్కడే Gemini సహాయం చేస్తుంది.
Geminiని మీ వ్యక్తిగత టీచింగ్ అసిస్టెంట్గా భావించండి. ఇది మీ నోట్స్‌ను ఆర్గనైజ్ చేయడం, వర్క్‌షీట్‌లను డ్రాఫ్ట్ చేయడం, మెటీరియల్స్‌ను రెడీ చేయడం వంటి లెసన్ ప్లానింగ్‌లో ఎక్కువ సమయం తీసుకునే భాగాలపై పని చేస్తుంది—కాబట్టి మీరు మీ డెస్క్ వద్ద గంటల తరబడి గడపాల్సిన అవసరం లేదు. ఇది మీ విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది, మీ విద్యార్థులకు బోధించడం, వారిని ఇన్‌స్పైర్ చేయడం వంటి అత్యంత ముఖ్యమైన విషయాలపై మీరు ఫోకస్ చేసేలా చేస్తుంది.
మీ ఎడ్యుకేషన్ కమ్యూనిటీ మరిన్ని సాధించడంలో Gemini ఎలా సహాయపడుతుంది:
- లెర్నింగ్ లక్ష్యాలు, విద్యా ప్రమాణాలకు అనుగుణంగా లెసన్ ప్లాన్‌ల డ్రాఫ్ట్‌ను రూపొందించండి
- టెక్స్ట్‌లు, అసైన్‌మెంట్‌ల స్థాయిని మార్చండి, విద్యార్థుల ఆసక్తులకు అనుగుణంగా కంటెంట్‌ను సర్దుబాటు చేయడం ద్వారా వారి ఎంగేజ్‌మెంట్‌ను పెంచండి
- బేసిక్ లెవెల్ నుండి అసెస్‌మెంట్‌లను జెనరేట్ చేయండి, లేదా అనుకూలమైన ఆన్సర్ కీలతో మునుపటి ఉదాహరణలను ఉపయోగించండి
సాధారణ, రెడీమేడ్ డాక్యుమెంట్‌ల కోసం వెబ్‌లో సెర్చ్ చేయడానికి బదులుగా, మీ క్లాస్‌రూమ్ సామర్థ్యం, సిలబస్ ఆవశ్యకతలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన అనుకూల లెసన్ ప్లాన్‌లు, వర్క్‌షీట్‌లను రూపొందించడానికి మీరు Geminiతో ఎంగేజ్ అవుతారు.
డెమో
Geminiని ఉపయోగించి "ఫోర్స్ & లా ఆఫ్ మోషన్" అనే అంశంపై పూర్తి లెసన్ ప్లాన్‌ను ఎలా జెనరేట్ చేయాలో చూద్దాం, ఇందులో స్థానిక ఉదాహరణలు, అంచెల వారీ వర్క్‌షీట్‌లు, స్పష్టమైన విజువల్ ఎయిడ్ లేఅవుట్ ఉండేలా చూసుకుందాం.
ప్రాక్టీస్
ఇప్పుడు మీ వంతు! మీ Chrome బ్రౌజర్‌లో ఒక ట్యాబ్‌ను ఓపెన్ చేయండి లేదా మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి, వచ్చే వారం మీరు టీచ్ చేయబోయే అంశాల కోసం మీకు నచ్చిన విధంగా ఒక రిసోర్స్‌ను రెడీ చేయండి. ఈ దశలను ఫాలో అవ్వండి:
మీ టాస్క్:
1వ దశ: gemini.google.com లింక్‌ను తెరవండి.
2వ దశ: PARTS ఫ్రేమ్‌వర్క్ ఉపయోగించి మీ సొంత ప్రాంప్ట్‌ను క్రియేట్ చేయండి లేదా కింద ఉన్న ప్రాంప్ట్ టెంప్లేట్‌ను మీకు నచ్చినట్లుగా మార్చుకుని కాపీ చేయండి.
“ఇండియన్ స్కూల్ టీచర్‌లా వ్యవహరించు. [Class ____] కోసం '[Name of Topic]' అనే అంశంపై 40 నిమిషాల లెసన్ ప్లాన్‌ను క్రియేట్ చేయండి. [మీరు ఫాలో అయ్యే గైడ్‌లైన్స్‌ను బట్టి, అంటే స్టేట్ బోర్డ్‌లు/NCF] 3 స్పష్టమైన లెర్నింగ్ అవుట్‌కమ్‌లను చేర్చండి. కాన్సెప్ట్‌ను వివరించడానికి చక్కటి రియల్-టైమ్ ఇండియన్ ఎగ్జాంపుల్‌ను ఉపయోగించండి. వివరణాత్మక లేబుల్స్, బాణాలు, బ్లాక్‌లతో ఈ ఉదాహరణను స్పష్టంగా వివరించేలా ఒక బ్లాక్‌బోర్డ్ డయాగ్రామ్ లేఅవుట్‌ను అందించండి, తద్వారా అది ఎవరికైనా సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. ఫైనల్‌గా, మూడు ప్రశ్నలతో కూడిన వర్క్‌షీట్‌ను ప్రొవైడ్ చేయండి. ఇది మూడు లెవెల్స్‌గా డివైడ్ అయి ఉండాలి: లెవెల్ 1 (బేసిక్ అండర్‌స్టాండిగ్), లెవెల్ 2 (అప్లికేషన్), లెవెల్ 3 (అడ్వాన్స్‌డ్/క్రిటికల్ థింకింగ్).”
_ (మీ రాబోయే క్లాస్‌కు సరిపోయేలా మీ సొంత సబ్జెక్ట్, క్లాస్, టాపిక్, అలాగే లోకల్ ఉదాహరణలతో [ ఇలాంటి ] బ్రాకెట్ టెక్స్ట్‌ను రీప్లేస్ చేయండి.)_
3వ దశ: మీకు నచ్చిన ప్రాంప్ట్‌ను Geminiలో పేస్ట్ చేసి, ఎంటర్ నొక్కండి.
4వ దశ: జెనరేట్ అయిన లెసన్ ప్లాన్‌ను, స్టెప్-బై-స్టెప్ ఎక్స్‌ప్లనేటరీ విజువల్ మ్యాప్‌ను, అంచెల వారీ వర్క్‌షీట్‌లను రివ్యూ చేయండి. మీరు ఏవైనా మార్పులు చేయాలనుకుంటే, తదుపరి ప్రాంప్ట్‌ను ఫాలో అవ్వండి.
5వ దశ: ఎగువన కుడి వైపు మూలన ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేసి, మీ ఎడిట్ చేయగల వెర్షన్‌ను సేవ్ చేయడానికి Docsకు ఎగుమతి చేయండి ని ఎంచుకోండి.
రిఫ్లెక్షన్
మీరు కేవలం రెండు నిమిషాల్లో జెనరేట్ చేసిన డాక్యుమెంట్‌ను చూడటానికి కాస్త సమయం కేటాయించండి.
లెసన్ ప్లాన్‌ను మాన్యువల్‌గా మ్యాప్ చేయడానికి, క్రియేటివ్ బ్లాక్‌బోర్డ్ డయాగ్రామ్‌ను రూపొందించడానికి, లోకల్ ఉదాహరణలను కనుగొనడానికి, అలాగే విభిన్నమైన ప్రశ్నలను టైప్ చేయడానికి మీకు ఎంత సమయం పట్టి ఉండేది?
ఇన్‌స్టంట్ విజువల్ ఎయిడ్ ఫ్రేమ్‌వర్క్ ఉండటం వలన మీ క్లాస్‌లోని విజువల్ లెర్నర్‌లకు క్లిష్టమైన కాన్సెప్ట్‌లను అందించే విధానం ఎలా మారుతుంది?
